ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు. జాతర సమయంలో రద్దీగా ఉంటుందని.. దర్శనం సరిగ్గా కాదన్న భావనతో ముందుగానే మేడారానికి విచ్చేస్తున్నారు. ప్రతి బుధవారం, ఆదివారాల్లో రద్దీ ఎక్కువైతోంది. సంక్రాంతి సెలువులు కూడా కావడం వల్ల రెండు రోజుల నుంచి మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. గద్దెల వైపు కదులుతున్నారు. అమ్మల దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పసుపు కుంకుమలతో పూజలు చేసి.. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణతో పాటు తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయడం వల్ల మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి.
గడువు పెంచేది లేదు: