తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్ కార్యాలయ ప్రహారీ గోడలపై మేడారం చిత్రాలు - ములుగు కలెక్టర్ కార్యాలయ ప్రహారీ గోడలపై మేడారం చిత్రాలు

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రహరీ గోడపై రంగురంగులతో మేడారం జాతర విశేషాలను చిత్రాల రూపంలో వేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

wall paints
కలెక్టర్ కార్యాలయ ప్రహారీ గోడలపై మేడారం చిత్రాలు

By

Published : Dec 13, 2019, 7:50 PM IST

మేడారం జాతర విశ్వ వ్యాప్తం చేసేందుకు అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. కలెక్టర్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది వస్తూ పోతూ ఉంటారు. వారిని ఆకర్షించేందుకు మేడారం జాతర దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజలు ఎడ్ల బండ్లపై ఎక్కి జాతరకి వెళ్లే దృశ్యాలు మొదలుకొని సమ్మక్క, సారలమ్మ గద్దెలు, గిరిజనుల ఆచార సంప్రదాయాలు, ఎత్తు బంగారం, ఎదురు కోళ్లు, గిరిజన నృత్యాలు, పిల్లాపాపలతో భుజానికెత్తుకుని కాలినడకన జాతరకు వెళ్ళడం మొదలగు చిత్రాలు కలెక్టర్ కార్యాలయ ప్రహరీ గోడపై రంగు రంగులతో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పది మంది చిత్రకారులు మూడు రోజులుగా శ్రమించి వీటిని వేస్తున్నారు. మరో పది రోజుల వరకు రహదారిపై సుమారు వందకు పైగా చిత్రాలు గీసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

కలెక్టర్ కార్యాలయ ప్రహారీ గోడలపై మేడారం చిత్రాలు

ఇవీ చూడండి: బెంగళూరులో వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details