తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు - medaram jathara gold

ఆ చోట డబ్బులను ఉతికేస్తున్నారు. ఆరేస్తున్నారు. శుభ్రంగా కడిగి.. ఇస్త్రీ చేస్తున్నారు. డబ్బులను ఉతికేయడమేంటీ అనుకుంటున్నారా..? అవును.. మేడారం జాతర హుండీ లెక్కింపులో అధికారులు అనుసరిస్తున్న పద్ధతి డబ్బులను ఉతికేయడమే.

medaram jathara
మేడారం జాతర హుండీ లెక్కింపు

By

Published : Feb 19, 2020, 1:06 PM IST

Updated : Feb 19, 2020, 10:26 PM IST

మేడారం జాతర హుండీలో వాన నీటితో తడిసి పోయిన నోట్ల లెక్కింపు కష్టంగా మారుతోంది. వాటన్నింటినీ సిబ్బంది ఒక చోటుకు చేర్చి.. శుభ్రంగా కడిగి.. ఇస్త్రీ చేసి లెక్కిస్తున్నారు. కొన్ని నోట్లు చిరిగి రెండు ముక్కలైయ్యాయి. సాధ్యమైనంతవరకూ నోట్లను బాగు చేసి లెక్కిస్తున్నామని.. ఇక వీలుకాని పరిస్థితిలో రిజర్వ్ బ్యాంకుకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.

తడిసిముద్దైన ఒడిబియ్యం

సమ్మక్క-సారలమ్మలకు సమర్పించిన ‍ఒడిబియ్యం కూడా తడిసిముద్దవడం వల్ల కుప్పలుగా పోసి ఆరబెట్టారు. జాతర ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 1980లో నాలుగు లక్షల యాభై వేల ఆదాయం రాగా.. 1990లో అది 24 లక్షల 90 వేలకు చేరింది. 2010లో నాలుగు కోట్ల మేర ఆదాయం రాగా.. రెండేళ్ల క్రితం జరిగిన జాతరలో పది కోట్ల మేరకు హుండీ ఆదాయం పెరిగింది. ఇక ఈసారి ఇప్పటికే పదిన్నర కోట్ల మేర ఆదాయం దాటిందని... బంగారు, వెండి ఆభరణాల లెక్కింపు కూడా జరుగుతోందని... మరో రెండు మూడు రోజుల్లో మొత్తం హుండీ లెక్కింపు పూర్తి కానుందని చెబుతున్న డబ్బు, బంగారం లెక్కింపు ఇంఛార్జీలు నర్సింహులు, అంజనీ కుమారితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

మేడారం జాతర హుండీ లెక్కింపు

ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి

Last Updated : Feb 19, 2020, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details