ములుగు జిల్లాలోని మేడారం గిరిజన మహా కుంభమేళా జాతర మూడు రోజుల పాటు ఘనంగా సాగింది. వనదేవతలను కోటిన్నర భక్తజనులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అమ్మలను దర్శించుకున్న భక్తులు మొక్కులు సమర్పించి తల్లి వెళ్ళొస్తామంటూ తిరుగు పయనమయ్యారు.
కన్నుల పండువగా అమ్మవార్ల దర్శనం.. భక్తుల తిరుగు పయనం
మేడారం మహాజాతరలో దేవతలందరూ కొలువైన మూడో రోజు శుక్రవారం భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటికే దర్శనం చేసుకున్న భక్తులు ఊర్లకు పయనమయ్యారు. నాలుగో రోజైన నేడు దేవతల వన ప్రవేశంతో అధికారికంగా జాతర ముగియనుంది.
కన్నుల పండువగా అమ్మవార్ల దర్శనం.. భక్తుల తిరుగు పయనం
వివిధ వాహనాల్లో తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మల దర్శనం అనంతరం ఊళ్లకు పయనమయ్యారు. నాలుగో రోజైన నేడు దేవతల వన ప్రవేశంతో అధికారికంగా జాతర పూర్తికానుంది.
ఇదీ చూడండి :పచ్చని బడిలో... సాగుతున్న పాఠాలు..