తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతరకు రూ. 75కోట్లు - జెడ్పీ సర్వసభ్య సమావేశం ములుగు తాజా వార్త

మేడారం జాతర అభివృద్ధి పనులకు రూ. 75 కోట్లు మంజూరు చేసినట్లు సత్యవతి రాఠోడ్​ తెలిపారు. ములుగు జిల్లా ఏర్పడ్డాక ఏర్పాటు చేసిన మొట్ట మెదటి జడ్పీ పాలక మండలి సర్వసభ్య సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్​, మహబూబాబాద్​ ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.

medaram-jatara-development-works
మేడారం జాతరకు రూ. 75కోట్లు

By

Published : Dec 1, 2019, 6:16 PM IST

ములుగు జిల్లా ఏర్పడ్డాక మొట్టమొదటి జెడ్పీ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర మంత్రివర్యులు హాజరైయ్యారు. జిల్లాలోని 9 మండలాల జెడ్పీటీసీలతో పాటు జడ్పీ పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్​పర్సన్ కుసుమ జగదీష్ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ మొదటి జడ్పీ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

వచ్చే ఫిబ్రవరి మాసంలో జరగబోయే గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జాతర అభివృద్ధి పనులకు 75 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. రోగాలు ప్రబలకుండా ఆరోగ్యపరమైన చర్యలు చేపట్టాలని పీసీ కేంద్రాల్లో వైద్యులు, మందులు తదితర అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోనె సంచులు ముందస్తుగానే అందించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ములుగు జిల్లాకు ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు చేసిన కలెక్టర్​ను అభినందించారు.

మేడారం జాతరకు రూ. 75కోట్లు

ఇదీ చూడండి: బావిలో పడి యువకుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details