మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను వారు దర్శించుకున్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు సీఎస్, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.
'మేడారం జాతర ఏర్పాట్లను వేగవంతం చేయండి' - MEDARAM JATARA CS, DGP REVIEW MEET AT MULUGU
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులు మరిచిపోలేని అనుభూతితో తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్కార్ ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని... ఎక్కడ ఏలాంటి లోటుపాట్లు రాకూడదని స్పష్టం చేశారు.
!['మేడారం జాతర ఏర్పాట్లను వేగవంతం చేయండి' MEDARAM JATARA CS, DGP REVIEW MEET AT MULUGU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5767112-169-5767112-1579442165734.jpg)
'మేడారం జాతర ఏర్పాట్లను వేగవంతం చేయండి'
జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, కల్యాణకట్ట, పార్కింగ్ ఏర్పాట్ల పరిశీలించిన అధికారులు... పనుల పురోగతిపై వివిధ శాఖలతో సమీక్షించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్నిశాఖల సమన్వయంతో ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న సీఎస్, డీజీపీలతో ఈటీవీ భారత్ ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి...
'మేడారం జాతర ఏర్పాట్లను వేగవంతం చేయండి'
ఇవీచూడండి: మేడారంలో పర్యటించిన సీఎస్, డీజీపీ