సమ్మక్క సారలమ్మల హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 502 హుండీలను ఈ నెల 12 నుంచి 26వరకు లెక్కించారు. నగదు రూపేణా రూ.11 కోట్ల 65 లక్షలు ఆదాయం చేకూరిందని... వాటితో పాటు కిలో 63 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరినట్లు మేడారం ఈవో పేర్కొన్నారు.
సమ్మక్క, సారలమ్మల హుండీ ఆదాయం ఎంతంటే..
మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర హుండీల లెక్కింపు పక్రియ ముగిసింది. ఈ నెల 12 నుంచి 26 వరకు హన్మకొండలోని తితిదే కల్యాణమండపంలో జాతర హుండీల ఆదాయం లెక్కించారు. మొత్తం 502 హుండీలును లెక్కించగా 11 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చినట్లు మేడారం ఈవో రాజేంద్రమ్ తెలిపారు.
సమ్మక్క, సారలమ్మల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
గత జాతర సందర్భంగా రూ.పది కోట్లు చేకూరగా ఈ సారి కోటికి పైగా చేకూరినట్లు వివరించారు. రోజూ 200 మందితో సీసీ కెమెరాలు, బందోబస్తు మధ్య హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఆదాయం బ్యాంకులో జమ చేస్తున్నట్లు తెలిపారు.