వరంగల్ హన్మకొండలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతోంది. వారం రోజుల నాటికి హుండీల ఆదాయం 10 కోట్లు దాటింది. మొత్తం 494 హుండీల్లో ఇప్పటివరకు 20 హుండీలు లెక్కించారు.
మేడారం: 7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 494 హుండీల్లో ఇప్పటివరకు 420 హుండీల లెక్కింపు జరిగింది.
7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం
వెండి నాణేలతోపాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు కూడా భక్తులు హుండీలో వేశారు. జాతర సమయంలో వర్షం కారణంగా హుండీల్లో నీరు చేరి... నోట్లు తడిసి పోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని నోట్లు బూజు పట్టినట్లు తెలిపారు. వీటిని లెక్కించడానికి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మొత్తం 200 మంది సిబ్బంది సీసీ కెమెరాల మధ్య హుండీలు లెక్కిస్తున్నారు.