ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర - medaram chinna jathara news
14:55 January 17
ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర
ఈ ఏడాది ఫిబ్రవరిలో ములుగు జిల్లాలో జరగబోయే మేడారం చిన్న జాతర (మండ మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు చిన్న జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా నిత్యం జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించనున్నారు.
25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేయనున్నారు. 26న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం 27వ తేదీన జాతర ముగియనుంది. ఈ జాతరకు సంబంధించిన పూర్తి వివరాలను ఆలయ ఈవోకు తెలియజేశారు.