తెలంగాణ

telangana

ETV Bharat / state

maoist bandh in telangana: మావోయిస్టుల బంద్.. ఏజెన్సీల్లో టెన్షన్.. టెన్షన్..! - తెలంగాణ వార్తలు

పోలీసులు, మావోయిస్టులకు సోమవారం జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో... మావోయిస్టులు నేడు బంద్​కు(maoist bandh in telangana) పిలుపునిచ్చారు. కాగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రహదారుల వెంబడి తనిఖీలు ముమ్మరం చేశారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

maoist bandh in telangana, mosits bandh news
బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు, మావోయిస్టుల బంద్ వార్తలు

By

Published : Oct 27, 2021, 1:59 PM IST

నేడు తెలంగాణ బంద్​కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో రహదారుల వెంబడి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్​కౌంటర్ జరిగిన నాటి నుంచి అప్రమత్తమైన పోలీసులు... నేడు బంద్​కు పిలుపునిచ్చిన కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తెలంగాణ-ఛత్తీస్​గఢ్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అందుకు నిరసనగా మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చారు. ఈ బంద్​ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఎదురు కాల్పులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరుకు సమీపంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు(maoist killed in telangana). ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, బీజాపూర్ జిల్లా తాళ్ల గూడెం మధ్య గల అడవి ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్​లో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు(maoist killed in telangana) పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల ఘటనను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ధ్రువీకరించారు.

ఏజెన్సీలో అలజడి

ఘటనా స్థలం నుంచి 3 మృతదేహలతో పాటు ఎస్​ఎల్​ఆర్, ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో ఏజెన్సీలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మావోయిస్టులు వెట్టి ఐత అలియాస్ ఐతడు, మూచకి ఉంగల్​గా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఐత ఈ ఘటనలో మృతిచెందినట్లు తెలిపారు. రఘు బీజాపూర్ జిల్లా భైరంగడ్ మండలం కొర్రవాడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ముమ్మరం

అగ్రనేత ఆర్​కే మరణం తర్వాత తెలంగాణ-ఛత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ సంయుక్త బలగాలు కూంబింగ్ ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం ఎన్​కౌంటర్ ఘటన చోటుచేసుకుంది.

ఇదీ చదవండి:maoist killed in telangana: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details