ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వెంకటాపురం-భద్రాచలం మార్గంలోని విజయపూర్ కాలనీ సమీపంలో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. ఈ నెల 25న సంపూర్ణ బంద్ పాటించాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో కరపత్రాలు వెలిశాయి. దీంతో పోలీసులు వాజేడు- వెంకటాపురం రహదారి, ఏటూరునాగారం ముళ్లకట్ట బ్రిడ్జి మీదుగా చత్తీస్గఢ్ రోడ్డు మార్గంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
మావోయిస్టు కరపత్రాల కలకలం.. పోలీసులు అప్రమత్తం - ములుగు జిల్లా వార్తలు
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 25న సంపూర్ణ బంద్ పాటించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు వెలిశాయి. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
![మావోయిస్టు కరపత్రాల కలకలం.. పోలీసులు అప్రమత్తం maoist-posters-found-in-mulugu-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8130301-599-8130301-1595425984603.jpg)
మావోయిస్టు కరపత్రాల కలకలం