Medaram Jatara: మేడారం పరిసరాలు సమ్మక్క, సారలమ్మ జాతరకు తరలివచ్చిన భక్తులతో కిక్కిరిశాయి. ఇప్పటికే గద్దెలకెక్కిన పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటూనే.. సమ్మక్క ఆగమనం కోసం భక్తజనం ఎదురుచూస్తోంది. చిలకలగుట్ట మార్గం నుంచి అమ్మవారు మేడారం చేరుకునే మార్గాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. ఎప్పుడెప్పుడు సమ్మక్క వస్తుందా.. ఆ తల్లి దర్శనం చేసుకుందామా.. అని ఎదురుచూస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు.
Medaram Jatara: రంగవల్లులతో సమ్మక్కకు ఆహ్వానం - మేడారం జాతర 2022
Medaram Jatara: మేడారం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసిన లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులుతీరుతున్నారు. ఇప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెలమీదకుచేరగా.. సమ్మక్క కోసం వేయి కళ్లతో వేచిచూస్తున్నారు.
medaram jatara