పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం ములుగు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. రేపు జరిగే ఎన్నికల్లో అందరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
'పట్టభద్రులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి' - Mulugu District is the latest news
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం ములుగు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 మండలాల్లో మొత్తం 105 మంది సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ములుగు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బందితో పాటు సామాగ్రిని తరలించామని వెల్లడించారు. జిల్లాలోని 9 మండలాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 105 మంది అధికారులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను నియమించినట్లు తెలిపారు.