ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసి తలనీలాలు సమర్పించుకున్నారు. కాలినడకన వచ్చి గద్దెల వద్దకు చేరుకొని ఒడి బియ్యం, పసుపు మొక్కలు, నిలువెత్తు బంగారం (బెల్లం) అమ్మ వార్లకు సమర్పించుకున్నారు.
మేడారానికి పోటెత్తిన భక్తులు - మేడారానికి పోటెత్తిన భక్తులు
వన దేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. అసలైన జాతర ప్రారంభం కాకముందే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారానికి పోటెత్తిన భక్తులు