ఓ పక్క కరోనా మహమ్మారితో ప్రజలందరూ కకలావికలమవుతుంటే మరోపక్క ఎడారి మిడతలదండు ఎవ్వరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీలో మిడతలదండు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మిడతలు మహారాష్ట్రలో పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతో గ్రామస్థులు ఇవి ఆ మిడతలేనేమో అని భయపడుతున్నారు. అయితే పంటలకు హాని చేసే మిడతలదండుకు కాకుండా, నిత్యం మనుషుల మధ్య తిరిగే హాని చేయని మిడతలను చూసి గ్రామస్థులు భయపడుతున్నారని, ఈ మిడతలతో ఎలాంటి హానీ ఉండదని అధికారులు తెలిపారు.
విజయపురి కాలనీలో మిడదల దండు.. ఆందోళనలో అన్నదాతలు - తెలంగాణ తాజా వార్తలు
ములుగు జిల్లా వెంకటాపురంలోని విజయపురి కాలనీలో మిడతల దండు గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ మిడతలు పంటలకు హానీ చేసేవి కావని, ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.
'ఆ మిడతల వల్ల ఎలాంటి హాని ఉండదు'