తెలంగాణ

telangana

ETV Bharat / state

లైవ్​ఆర్ట్స్​తో ప్రతిభ చూపుతున్న కళాకారుడు

మేడారం జాతరలో కళ్ల ముందు జరిగే సన్నివేశాలను చిత్రాల రూపంలో గీస్తూ ఓ వ్యక్తి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. కళాయాత్ర పేరుతో కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేపట్టి వివిధ ప్రాంతాల ప్రజల జీవనవిధానాన్ని రానున్న తరాలకు అందజేయాలనుకునే ఆ కళాకారుడి విశేషాలేంటో తెలుసుకుందామా..

live art drawing artist in medara
లైవ్​ఆర్ట్స్​తో ప్రతిభ చూపుతున్న కళాకారుడు

By

Published : Feb 5, 2020, 3:26 PM IST

మేడారం జాతరలో కళ్ల ముందు జరిగిన సన్నివేశాలను బొమ్మల రూపంలో చిత్రీకరిస్తూ పోచం అనే కళాకారుడు ఔరా అనిపిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన పోచం 2017లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కళాయాత్ర పేరుతో చేపట్టాడు.

యాత్రలో భాగంగా గుజరాత్​లోని రానాఆఫ్​కచ్, రాజస్థాన్​లోని పుష్కర మేళ వంటి ప్రాంతాలను సందర్శించి.. అక్కడ ఉండే గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అందమైన చిత్రాలను ఆవిష్కరించారు. మొత్తం నాలుగు రాష్ట్రాలు సందర్శించిన ఈ యువకుడు అక్కడ చూసిన అనేక పరిస్థితులను బొమ్మల రూపంలో అందంగా తీర్చిదిద్దాడు. ప్రభుత్వం సహకరిస్తే వీటన్నింటిని ఒకచోట చేరుస్తూ పుస్తకాన్ని విడుదల చేస్తానని ఆయన చెబుతున్నాడు.

లైవ్​ఆర్ట్స్​తో ప్రతిభ చూపుతున్న కళాకారుడు

ఇదీచూడండి: మేడారంలో బొమ్మ దించేస్తున్నాడు..

ABOUT THE AUTHOR

...view details