ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మేడారం మహా జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు నడుంబిగించారు. దీనిలో భాగంగా గ్రామ సర్పంచ్ చిడం బాబురావు గ్రామ సిబ్బందితో పాటు జంపన్న వాగు నుంచి గుడి వరకు ఏర్పాటు చేసిన దుకాణదారులకు అవగాహన కల్పించారు.
'ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకుందాం'
మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా చేసేందుకు సర్పంచ్ చిడం బాబురావు నడుంబిగించారు. గ్రామ సిబ్బందితో కలిసి జంపన్న వాగు నుంచి గుడి వరకు ఏర్పాటు చేసిన దుకాణదారులకు అవగాహన కల్పించారు.
'ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకుందాం'
షాపులలో ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ తరుపున జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఎలాంటి తీసుకురావద్దని సూచించారు.
ఇవీచూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'