ములుగు జిల్లాలో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలు, వాగులు, చెరువులు నిండుకుండలుగా మారాయి. ప్రధానంగా కొత్తగూడ అడవి ప్రాంతంలో భారీ వర్షాలకు బొగ్గులవాగు పొంగిపొర్లుతోంది.
పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు - పొంగిపొర్లుతున్న జంపన్న వాగు, దెయ్యాలవాగు
ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్నవరం చెరువు మత్తడి పోస్తోంది. రామప్ప చెరువులో నీటి మట్టం పెరుగుతోంది. ముళ్లకట్ట వద్ద గోదావరి సైతం పొంగిపొర్లుతోంది.

పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుకు వరద నీరు భారీగా చేరుకుని మత్తడి పోస్తోంది. ప్రస్తుతం ఈ సరస్సులో నీటిమట్టం 33.5 అడుగుల నీరు చేరడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ములుగు వెంకటాపురంలోని రామప్ప చెరువులో నీటి మట్టం పెరిగి ప్రస్తుతం 29 అడుగులకు చేరుకుంది. ఏటూరునాగారం మండలంలోని జంపన్న వాగు, దెయ్యాలవాగు పొంగిపొర్లుతున్నాయి.
పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు
ఇదీ చూడండి :నేడు తేలికపాటి వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వర్షం
Last Updated : Aug 13, 2020, 5:55 PM IST