ములుగు జిల్లా మేడారంలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు విజృంభిస్తున్నాయి. పిల్లాపాపలతో వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకొని అపహరణలకు పాల్పడుతున్నారు. ఓ మహిళ చిన్నారిని అపహరించేందుకు యత్నించగా శిబిరం నిర్వాహకులు గుర్తించి పట్టుకున్నారు.
మేడారం జాతరలో కిడ్నాప్ ముఠాలు.. మీ పిల్లలు జాగ్రత్త.. - medaram jatara news today
జాతరలో పిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారిని నిరంతరం గమనించాలి. చేయి పట్టుకుని వెంట తీసుకెళ్లాలి. ఎందుకంటే మేడారం జాతరలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఓ మహిళ చిన్నారిని అపహరించేందుకు యత్నించగా అక్కడ సిబ్బంది అప్రమత్తమై పట్టుకున్నారు.
మేడారం జాతరలో కిడ్నాప్ ముఠాలు.. మీ పిల్లలు జాగ్రత్త..
వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మంది దొంగల ముఠా మేడారం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి :మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు