కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రి 12.09 నిమిషాల నుంచి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 03 నిమిషాలకు వరకు పౌర్ణమి ప్రత్యేక పూజలు జరుగుతాయి.
రామప్పలో కార్తిక శోభ... పోటెత్తిన భక్తులు - ములుగు జిల్లా తాజా వార్తలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా వివిధ ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే రామప్ప ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుపుతున్నారు.
రామప్పలో కార్తిక శోభ... పోటెత్తిన భక్తులు
రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. కార్తిక పౌర్ణమి నాడు శివారాధన చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయని... అందుకే వేకువ జామునే ఆలయానికి వచ్చామని భక్తులు తెలిపారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఇదీ చదవండి:కార్తికమాస పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ