తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క - తెలంగాణ వార్తలు

ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్​ చేతుల మీదుగా కోటి 17లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Kalyana Lakshmi cheques distributed by mulugu MLA Seetakka
కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

By

Published : Dec 24, 2020, 4:07 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో 117 మందికి కోటి 17లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్​ల చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ ఛైర్మన్​​ కుసుమ జగదీశ్వర్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్​తో పాటు రెవెన్యూ అధికారులు, పలు గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఇంట్లో విద్యుదాఘాతం... మంటల్లో సామగ్రి దగ్ధం

ABOUT THE AUTHOR

...view details