ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఐటీడీఏ పీఓ హనుమంతు పరిశీలించారు. ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే చిన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
మేడారం చిన్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఐటీడీఏ పీఓ - ములుగు జిల్లా తాజా వార్తలు
మేడారం చిన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు... ఐటీడీఏ పీఓ హనుమంతు జండగే తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
మేడారం చిన్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఐటీడీఏ పీఓ
చిలకలగుట్ట వద్ద పార్కింగ్ స్థలం, జంపన్న వాగు దగ్గర స్నాన ఘట్టాల ఏర్పాటు వంటి పనులను పీఓ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో వన దేవతల దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. జాతర సమయంలో హన్మకొండ నుంచి మేడారం వరకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసే విధంగా అధికారులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టిప్పర్ ఢీకొని.. హైదరాబాద్లో నేపాల్ దంపతుల దుర్మరణం