ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గిరిజన శిశువు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలపై వాడివేడిగా చర్చ నిర్వహించారు.
ములుగు ఏజెన్సీలో ఉన్న గ్రామాలకు రోడ్డు నిర్మాణం, విద్యుత్ పనులు చేపట్టినప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల గిరిజన గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. మేడారం జాతరకు ఎన్నోమార్లు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించినప్పటికీ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలున్నాయని ఆమె అన్నారు.
సీఎం కేసీఆర్తో చర్చిస్తా : సత్యవతి రాథోడ్
ఎమ్మెల్యేలు, జడ్పీటీసీల సమస్యలు విన్న మంత్రి సత్యవతి రాథోడ్... ఏజెన్సీ గ్రామాల్లో రైతులపై దాడులు చేస్తున్న అటవీశాఖ అధికారులపై సీఎం కేసీఆర్తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో రోడ్డు నిర్మాణాలు, వాగులపై బ్రిడ్జిలు అటవీ అధికారులతో మాట్లాడి ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తయ్యేలా చూస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.
సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ శంకర్ నాయక్, భూపాలపల్లి గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ జగదీశ్వర్, జడ్పీపీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.
మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా : మంత్రి సత్యవతి ఇవీ చూడండి : సమత కేసులో డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత