సరిహద్దుల్లో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ములుగు జిల్లా వెంటాపురం, వాజేడు మండాలల్లోని ఛత్తీస్గడ్ రాష్ట్రానికి, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు హద్దులుగా ఉన్న ప్రధాన మార్గాలను మూసివేశారు. కరోన వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
సరిహద్దు రహదారులు కట్టడి - స్వీయ నిర్బంధం
ఇతర రాష్ట్ర, అంతరాష్ట్ర జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్న ములుగు జిల్లాలోని ప్రధాన రహదారులను పోలీసులు మూసేశారు. రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఎక్కడిక్కడ ఆపేశారు.
సరిహద్దు రహదారులు కట్టడి
ఏటూరునాగారం, మంగాపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి, గోవిందరావుపేట, మండాలల నుంచి వస్తున్న వాహనాలను ములుగు జిల్లా కేంద్రంలో రెవిన్యూ, పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండి సర్కారు ఆదేశాలను పాటించాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము