ములుగు జిల్లాలో 2,93,915 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులున్నా, ఆకాశాన్ని అంటుతున్న వృక్షాలు కనిపిస్తున్నా కోతులు, పక్షులు తినేందుకు పండ్లను అందించే చెట్లు కరవయ్యాయి. కోతుల పండ్ల వనాలు కాగితాలకే పరిమితమయ్యాయి. పండ్ల వనాల ఏర్పాటు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినా అధికారుల్లో చలనం లేకపోయింది. హరితహారం పేరుతో లెక్కలకోసం మొక్కలు నాటుతున్న పాలకులు, అధికారులు మూగజీవాల క్షుద్బాధను తీర్చేందుకు చేస్తున్న పనుల్లో చిత్తశుద్ధి కనిపించడంలేదు. ములుగు మండలం జాకారం, తాడ్వాయి మండలంలో మాత్రమే పండ్ల వనాలు ఏర్పాటు చేశారు. జాకారంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో 800, తాడ్వాయిలో 100 పండ్ల మొక్కలను నాటారు. కోతుల పండ్లవనాలను(మంకీ ఫుడ్ కోర్టు) అడవులకు దగ్గరగా ఏర్పాటు చేస్తే మేలు.
అడవిలో పండ్ల మొక్కలేవీ..?
అడవిలో అధికంగా కనిపించే నేరేడు, ఉసిరి, వెలగ, జీడిమామిడి, తునికి, మొర్రి, పరికి, పాల పండ్ల చెట్లు ప్రస్తుతం మచ్చుకైనా కనిపించని దుస్థితి ఏర్పడింది. వానరాలు, పక్షులు అడవిలో పరుగులు పెట్టాల్సిన మూగజీవులు.. రహదారుల వెంట వాహనాలను చూసి వాటి వెనుక పరిగెత్తాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది. పండ్ల మొక్కలను అక్రమార్కులు నరికివేయడం, అడవుల పెంపకంలో జంతువులకు ఆహారాన్ని అందించే ఫలాల మొక్కలను ప్రభుత్వం, అటవీశాఖ పెంచకపోవడమే. వ్యాపార దృక్పథం జామాయిల్ (యూకలిప్టస్), వెదురు, టేకు మొక్కలను పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ అడవుల అందాలకు ఆయువుపట్టైన పక్షులకు, జంతువులకు అవసరమైన పండ్ల మొక్కలు పెంచేందుకు శ్రద్ధ వహించడం లేదు. జిల్లాలోని ఏటూరునాగారం, పస్రా అభయారణ్యాల్లో కేవలం 22 హెక్టార్లలో అటవీశాఖ 8,800 పండ్ల మొక్కలను నాటింది. ఏటూరునాగారంలో 17 హెక్టార్లలో 6,800, పస్రాలో 5 హెక్టార్ల విస్తీర్ణంలో 2 వేల పండ్ల మొక్కలను అధికారులు నాటారు.
ప్రయాణికులు వేస్తేనే కడుపు నిండేది..