తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు - వనదేవతలను దర్శించుకున్న భక్తులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మినీ మేడారం జాతరలో అధికారులకు కరోనా సోకడంతో 21 రోజుల పాటు కొవిడ్​ నిబంధనలతో ఆలయాన్ని మూసేశారు. ప్రస్తుతం ఆలయ గేట్లను తెరిచిన అధికారులు దర్శనాలకు అనుమతులిచ్చారు.

Huge no of Devotees  to Medaram to see the sammakka- saralamma goddess at tadwai mandal mulugu district
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

By

Published : Mar 21, 2021, 7:16 PM IST

సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు 21 రోజుల తర్వాత భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన గేట్లను తెరిచి మేడారం వనదేవతల దర్శనాలను గిరిజన పూజారులు ప్రారంభించారు. గత నెల జరిగిన మినీ మేడారం జాతర సమయంలో ముగ్గురు ఎండోమెంట్ అధికారులకు కరోనా సోకింది. అప్పటి నుంచి కొవిడ్​ నిబంధనలతో ఆలయాన్ని మూసివేశారు.

అయినప్పటికీ భక్తులు వనదేవతలను దర్శనం చేసుకునేందుకు వచ్చి.. గేటు ముందే కొబ్బరికాయలు కొట్టి పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించుకుని తిరిగి ఇంటి దారి పట్టే వారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దర్శనం కల్పించేందుకు 21 రోజుల తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు-గోవిందరాజుల గేట్లు తెరిచారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని భక్తులు మాస్కులు ధరించి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇదీ చూడండి:'ఏ ప్రభుత్వమూ మా సంక్షేమానికి కృషి చేయలేదు'

ABOUT THE AUTHOR

...view details