తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పొంగుతున్న గోదావరి.. నీట మునిగిన లక్నవరం దీవులు - ములుగు జిల్లాలో పొంగిపొర్లుతున్న గోదావరి

ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని చెరువులు, కుంటులు నిండాయి. మహబూబాబాద్​ జిల్లాలోని బొగ్గుల వాగు పొంది లక్నవరం సరస్సు నిండింది. రెండు తీగల వంతెనలు, దీవులలోని కాటేజీలు నీట మునిగాయి.

heavy water flow in godavari at lakanavaram bridge floting
ఉప్పొంగుతున్న గోదావరి.. నీట మునిగిన లక్నవరం దీవులు

By

Published : Aug 16, 2020, 11:12 AM IST

ములుగు జిల్లాలో ఆరు రోజులుగా... కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. జోరు వానలకు గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అడవి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో... బొగ్గుల వాగు పొంగి పొర్లుతూ లక్నవరం సరస్సు 34.6 అడుగులు చేరుకుంది. రెండున్నర అడుగులతో మత్తడి పోస్తుంది. దీంతో రెండు తీగల వంతెనలు నీట మునిగాయి. సరస్సు దీవులలోని కాటేజీలల్లోకి నీళ్లు చొరబడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details