అసలైన జాతర ప్రారంభం కాకముందే మేడారానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల మేడారం పరిసరాలు కిటకిటలాడాయి. పక్షం రోజుల ముందే జాతర ప్రారంభమైందా అన్నట్లుగా భక్తుల తాకిడి కనిపించింది. జంపన్నవాగు వద్ద సందడి నెలకొంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి గద్దె బాట పట్టారు. గంటల సేపు క్యూ లైన్లలో అమ్మల దర్శనం కోసం బారులు తీరారు. బంగారాన్ని సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారానికి పోటెత్తిన భక్తులు - మేడారానికి పోటెత్తిన భక్తులు
సమ్మక్క-సారక్కలు కొలువైన మేడారం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
![మేడారానికి పోటెత్తిన భక్తులు heavy rush at medaram in mulugu district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5767394-thumbnail-3x2-jappanna.jpg)
మేడారానికి పోటెత్తిన భక్తులు