భారీ వర్షాలతో ములుగు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో లక్నవరం సరస్సు మత్తడి పోస్తుంది. గోవిందరావుపేట, ప్రాజెక్ట్నగర్ గ్రామాల మీదుగా దయ్యాల వాగు పొంగి పొర్లుతుంది.
ఎడతెరిపిలేని వర్షాలు... పొంగి పొర్లుతున్న వాగులు వంకలు - తెలంగాణ తాజా వార్తలు
ములుగు జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి.
![ఎడతెరిపిలేని వర్షాలు... పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఎడతెరిపిలేని వర్షాలు... పొంగి పొర్లుతున్న వాగులు వంకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8418517-676-8418517-1597409733518.jpg)
ఎడతెరిపిలేని వర్షాలు... పొంగి పొర్లుతున్న వాగులు వంకలు
వంకల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తాడ్వాయి మండలం రెవెన్యూ అధికారి శ్రీనివాస్ మేడారం జంపన్న వాగు పరిసరాల్ని పరిశీలించారు.