వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆకాశమంతా మేఘావృతమై ఉండి.. రాత్రి నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
వెంకటాపురంలో ఎడతెరిపి లేని వర్షం.. రైతుల హర్షం - వాజేడు వెంకటాపురంలో వర్షం వార్తలు
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్షాకాలం ప్రారంభంలోనే వానలు పడుతుండటం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![వెంకటాపురంలో ఎడతెరిపి లేని వర్షం.. రైతుల హర్షం heavy-rain-in-vajedu-venkatapuram-in-mulugu-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7633758-104-7633758-1592278238199.jpg)
వెంకటాపురంలో ఎడతెరిపి లేని వర్షం.. రైతుల హర్షం
సీజన్ ప్రారంభంలోనే జోరుగా వర్షాలు పడుతుండటం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి: 'కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించాలి'