ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ములుగు జిల్లా వాజేడు మండలంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ములుగు జిల్లాలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - ములుగు జిల్లాలో వర్షం వార్తలు
ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షాకాలం ప్రారంభంలోనే వానలు పడుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లాలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
మరోవైపు వెంకటాపురం మండలంలోనూ గురువారం రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఫలితంగా చెరువులు, వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. వెంకటాపురంలో 129.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభంలోనే భారీ వర్షాలు పడుతుండటం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి: మృతులను కొవిడ్‌గా నిర్ధరించట్లేదు.. కుటుంబీకుల్లో ఆందోళన