మబ్బుల చాటుకు సూర్యుడు... చిరుజల్లులు కురిపించిన వరుణుడు - telangana weather update
పదిరోజులుగా భగభగలాడిన వాతావరణం గంటపాటు కురిసిన వర్షంతో ఎంతో ఆహ్లాదంగా మారిపోయింది. ములుగు జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు వానజల్లుతో ఊపిరి పీల్చుకున్నారు.
మబ్బుల చాటుకు సూర్యుడు... జల్లు కురిపించిన వరుణుడు
ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పది రోజులుగా భానుడు చూపిస్తున్న ప్రతాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ రోజు సైతం మూడు గంటల వరకు భగభగా మండిన సూర్యుడు అరగంటలోనే కారుమబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. ఉరుములు మెరుపులతో గంటపాటు వర్షం కురిసింది. ఈ జల్లులతో వాతావరణం చల్లబడి... ఆహ్లాదంగా మారిపోయింది.