ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రామప్ప ఆలయానికి పోటెత్తిన భక్తులు... - shivaratri celebrations in ramappa temple
రామప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆలయ ప్రాంగణ శివనామ స్మరణతో మారుమోగుతోంది.
heavy flow to ramappa temple
అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ స్మామివారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... మాస్కులు ధరించి దర్శనం చేసుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.