బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షానికి గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే నది వరద ముంపునకు గురైన ప్రజలు సురక్ష ప్రాంతాల్లో ఉంటున్నారు.
మూడో ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి - high rainfall in mulugu
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మూడో హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది.
మూడో ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి
రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క, రెవెన్యూ అధికారులు, ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్ గోదావరిలో నీటి ప్రవాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.