ములుగు జిల్లాలో వాజేడు మండలంలోని చీపురుపల్లి సమీపంలోని బొగత జలపాతం గత కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మరింత అందాన్ని సంతరించుకుంది. కరోనా కారణంగా ఆరు నెలలుగా బోసిపోయిన జలపాతం వద్దకు గురువారం పర్యాటకులు రావడం వల్ల సందడిగా మారింది. మరో నయగారాగా పిలువబడే ఈ బొగత అందాలను చూసి పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చిన అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
సందడిగా మారిన బొగత జలపాతం - బొగత జలపాతానికి సందర్శకుల తాకిడి
ములుగు జిల్లా వాజేడు మండలం చీపురుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. బొగత అందాలను చూడడానికి గురువారం సందర్శకుల తండోపతండాలుగా వచ్చారు.

సందడిగా మారిన బొగత జలపాతం