ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో స్థానిక గిరిజన బాలికల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో మేడారం ప్రాంతంలోని ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, గోండు కోయగూడెం, పడిగాపూర్ గ్రామాల్లోని సుమారు 150 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. హైదరాబాద్కు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ ముకుంద్ వైద్య పరీక్షలు నిర్వహించారు.
మేడారంలో ఉచిత వైద్య శిబిరం - ములుగు జిల్లా తాజా వార్తలు
ములుగు జిల్లా మేడారంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 150 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేడారంలో ఉచిత వైద్య శిబిరం
ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎంపీపీ గొంది వాణిశ్రీ, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అవినాశ్, వనవాసి కల్యాణ పరిషత్ ములుగు జిల్లా కార్యదర్శి డాక్టర్ సుతారీ సతీశ్, గార్లపాడు గురురాజు, డాక్టర్ గొంది సత్యనారాయణ, డాక్టర్ నీరటి సంజీవరావు, మంకిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆర్టీసీ బస్సులో రూ.1.9 కోట్ల నగదు పట్టివేత