ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలో భక్తులు విచ్చలవిడిగా పడేసే చెత్తాచెదరాన్ని ఏరి శుభ్రంగా ఉంచేందుకు కూలీలను నియమించారు. రాజమండ్రి నుంచి మూడు వేల మందిని రప్పించినట్లు అధికారులు వెల్లడించారు.
మేడారంలో ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్యం పనులు - మేడారంలో పారిశుద్ధ్యం పనులు
తెలంగాణ కుంభమేళాగా పిలిచే ప్రతిష్ఠాత్మక మేడారం జాతరలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులు పడేసే చెత్తను శుభ్రం చేసేందుకు అధికారులు కూలీలను నియమించారు.
మేడారంలో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు
సమ్మక్క సారలమ్మ గుడి సమీపంలో, చింతల్ నార్లపూర్, బస్టాండ్ పరిధి, జంపన్న వాగు ఊరట్టం ప్రాంతాలలో నాలుగు చోట్ల పారిశుద్ధ్యం పనులు చేసేందుకు కూలీలను నియమించారు. చెత్త తరలించేందుకు 40 ట్రాక్టర్లు ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: మేడారంలో కృత్రిమ మేధస్సుతో నిఘా