మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు
07:34 February 07
మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు
మేడారం భక్తజన సందోహంగా మారింది. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడం వల్ల కిటకిటలాడుతోంది. వనదేవతలంతా గద్దెలపై కొలువుదీరడంతో భక్తుల తాకిడి పెరిగింది.
వన దేవతలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం జరుగుతున్న వేడుకను చూసి తరించారు. సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతలు రేపటి వరకూ గద్దెలపై ఆశీనులై ఉంటారు.
సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రంలోని గిరిజనులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మేడారం జాతర ప్రకృతితో మమేకమైందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రజలకు సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వనదేవతలకు మొక్కుకున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.