తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ఏర్పాట్లను గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​ అభినందించారు. కలెక్టర్​ ఆర్​వి కర్ణన్​ను అభినందిస్తూ గవర్నర్​ ప్రశంసాపత్రం పంపించారు.

medaram
మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు

By

Published : Feb 7, 2020, 10:17 PM IST

తెలంగాణల కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరలో.. సమ్మక్క- సారలమ్మను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఇవాళ దర్శించుకున్నారు. జాతరలో అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై తమిళిసై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని కలెక్టర్​ ఆర్​.వి.కర్ణన్​కు పంపించారు.

వనదేవతల దర్శనం సులభతరం చేసేందుకు మీరు, మీ యంత్రాంగం చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయం. మీ పనిని రికార్డుల్లో ఉంచాలనుకుంటున్నాం. నా సందర్శన సమయంలో విస్తరించిన మర్యాదలకు వ్యక్తిగతంగా.. మీ బృందంలోని ప్రతీ సభ్యునికి ధన్యవాదాలు, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.

జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్​ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, కలెక్టర్​, ఎస్పీ, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.

ఇవీచూడండి:మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు

సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details