తెలంగాణ

telangana

ETV Bharat / state

గట్టమ్మ తర్వాతే.. వనదేవతల దర్శనం

మేడారం వెళ్లే భక్తులు సమ్మక్కసారలమ్మ కన్నా ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. ములుగు పట్టణానికి రావడానికి ముందే గట్టమ్మ కొలువుదీరి ఉంది. సమ్మక్క దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు గట్టమ్మ దర్శనంతో పునీతమై వనదేవతల దర్శనానికి బయలుదేరి వెళ్తున్నారు.

Gattamma Darshan After Medaram Darshan at mulugu district
గట్టమ్మ దర్శనం తర్వాతే.. మేడారం దర్శనం

By

Published : Feb 3, 2020, 11:54 AM IST

మేడారం వెళ్లే భక్తులతో గట్టమ్మ ప్రాంతం కిటకిటలాడుతోంది. గట్టమ్మ దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్క దర్శనం చేసుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దీంతో మేడారం వెళ్లే భక్తులు తప్పకుండా గట్టమ్మను దర్శనం చేసుకొని ముందుకు కదులుతారు. ములుగు పట్టణానికి రావడానికి ముందే గట్టమ్మ కొలువుదీరి ఉంది. నాయక్ పోడు పూజారులు వచ్చిన ప్రతి భక్తున్ని ఆప్యాయతలతో వీర తిలకం దిద్ది తల్లుల దర్శనానికి మార్గం సుగమం చేస్తారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని చేపట్టిన ప్రచారానికి సంబంధించిన బ్యానర్లతో మేడారానికి వెళ్లే రోడ్డు మార్గం సూచించారు.

మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దారి పొడవునా మంచినీటి సౌకర్యం కల్పించారు. పలు ఎన్జీవోలు స్వచ్ఛంధంగా భక్తులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మేడారం దారిలో దొంగల భయం అధికంగా ఉండడం వల్ల దొంగల ఫోటోలతో కూడిన పోస్టర్లు దారి పొడవునా.. అంటించి భక్తులను అప్రమత్తం చేస్తున్నారు.

గట్టమ్మ దర్శనం తర్వాతే.. మేడారం దర్శనం

ఇదీ చూడండి :మేడారం జాతరలో ఉచిత వైఫై..

ABOUT THE AUTHOR

...view details