మేడారం జాతర వేళ... ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సమ్మక్క- సారలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులంతా... గట్టమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గట్టమ్మ తల్లి అనుమతి తీసుకునే.... మేడారం బయలుదేరుతున్నారు. అందుకే గట్టమ్మ ఆలయాన్ని 'గేట్ వే ఆఫ్ మేడారం'గా పిలుచుకుంటారు.
గట్టమ్మకే విన్నవించుకుంటారట..!
వాహనాల్లో వచ్చే భక్తులు అందరూ... గట్టమ్మ దగ్గర కాసేపు ఆగుతారు. తమ కోరికలు గట్టమ్మకు విన్నవించుకుని మేడారం బయలుదేరి వెళతారు. సమక్క- సారలమ్మకు గట్టమ్మ ఆప్తురాలైనందున... తమ కోరికలను నెరవేర్చమని అమ్మవార్లకు చెబుతుందని భక్తుల నమ్మకం. రద్దీ పెరగుతుండటం వల్ల ప్రభుత్వం ఆలయ పరిసరాలను అభివృద్ధి చేస్తోంది. విశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. మరుగుదొడ్లు నిర్మించారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ప్రమాదం రహదారి వెంబడి కంచె ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిని విస్తరించి...నాలుగు లేన్లుగా మార్చారు.