ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారి పేట గ్రామంలో స్నేహితుడి ఇంట్లోనే నలుగురు వ్యక్తులు దొంగతనం చేశారు. కుమ్మరి సత్యం అనే వ్యక్తి వనభోజనాలకు వెళ్లగా తన స్నేహితులు నలుగురు ఇంట్లో చొరబడి 90 వేల రూపాయల నగదు, 20 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండిని దొంగిలించారు.
స్నేహితులని నమ్మితే నిలువునా దోచేశారు.. చివరికి చిక్కారు!
నమ్మిన స్నేహితులే నట్టింట ముంచేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విలవైన బంగారం, వెండి ఆభరణాలు, 90 వేల నగదు దోచేశారు. ఈ ఘటన అయ్యవారి పేటలో చోటుచేసుకుంది.
వనభోజనాలకు వెళ్లి వచ్చిన సత్యం ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఇదేక్రమంలో ధర్మారం గ్రామ సమీపంలో సీఐ శివప్రసాద్ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తారస పడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి నుంచి 90 వేల రూపాయల నగదు, సుమారు మూడున్నర లక్షల విలవగలు బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.