తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒడ్డున ఉన్న మా ఇబ్బందులు చూడండయ్యా..

ఏటా వర్షాలు ఎప్పడు కురుస్తాయా... నదుల్లోకి నీరొచ్చి పంటలకు నీళ్లు ఎప్పుడు అందుతాయా అని అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ ఈ ఊరివాళ్లు మాత్రం వరదలొస్తున్నాయంటే కంటిమీద కునుకుండదు. సాయంత్రం చూసిన భూమి తెల్లారేసరికి గోదావరిలో కలిసిపోతుందేమోనని..దిగులుతో కాలం గడుపుతారు. వారే ములుగు జిల్లా మంగపేట మండల పొద్మూరు గ్రామస్థులు.

By

Published : Sep 7, 2019, 9:05 PM IST

ఒడ్డున ఉన్న మా ఇబ్బందులు చూడండయ్యా..

ఏటి ఒడ్డున ఊరు.. పుష్కలంగా నీరు... వాళ్లకేమి ఇబ్బంది అనుకుంటారు చాలామంది. మునిగిన వాడికే తెలుస్తుంది లోతెంతో.. అన్న చందంగా వరదలొచ్చినప్పుడు ఆ బాధలు పడిన వారికే తెలుస్తుంది ఆ ఇబ్బందులేంటో.. గంట గంటకూ పెరిగిపోయే వరద ఉద్ధృతికి ఏ సమయాన ఊరిని ముంచెత్తుతుందో... నీటి ప్రవాహా వేగంతో ఏటి ఒడ్డున ఎవరి భూమిని తనలో కలిపేసుకుంటుందోనన్న భయం.. వారికి కంటిమీద కునకుండడంలేదు. ములుగు జిల్లా మంగపేట మండలం పొద్మూరులో ఏటా వరద ఉద్ధృతిలో పదుల ఎకరాల్లో భూమి నీటిలో కరిగిపోతుంది.

కళ్లముందే కొట్టుకుపోతోంది

ప్రధాన నది ఒడ్డు పక్కనే ఊళ్లో వరద వస్తుందంటే గ్రామస్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే ఏటి గట్టున ఉన్న వ్యవసాయ భూములు నాలుగు మీటర్ల మేర కోతకు గురయ్యాయి. పుష్కర ఘాట్​ వద్ద నిర్మించిన వాటర్​ ట్యాంక్​ కూడా నదిలో కొట్టుకుపోయింది. పుష్కరఘాట్​ వరకు భూమి కోతకు గురవుతోంది. పుష్కర ఘాట్​లో మెట్లు కూడా నామరూపాల్లేకుండా పోతున్నాయి.

నీటి మూటగా మారిన నేతల హామీలు

గతంలో వరదల సమయంలో ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రులు, అధికారులు తక్షణమే మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. రివిట్​మెంట్​ వేయిస్తామని ఒడ్డు కొట్టుకుపోకుండా గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చిన నేతల మాటలు నీటిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వరద ప్రవాహాం నుంచి తమ భూములకు, ఊరికి రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని మంగంపేట, పొద్మూరు, బోరునర్సాపురం గ్రామస్థులు కోరుతున్నారు.

ఒడ్డున ఉన్న మా ఇబ్బందులు చూడండయ్యా..

ఇదీ చూడండి: వంతెన లేక కి.మీ. పది కిలోమీటర్లైంది..

ABOUT THE AUTHOR

...view details