తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ రహిత మేడారం జాతర కోసం..  పాదయాత్ర - ములుగు జిల్లా మేడారం జాతర

ఇప్పటికే ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్​, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. అదే ఉద్దేశంతో యాంటీ ప్లాస్టిక్ జాతర నిర్వహించాలనే ఉక్కు సంకల్పంతో ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. హన్మకొండ నుంచి మేడారం వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నాడు.

For Plastic Free Horoscope padayatra at hanamkonda warangal district
ప్లాస్టిక్ రహిత జాతర కోసం.. పాదయాత్ర

By

Published : Jan 9, 2020, 1:58 PM IST

మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలనే ఉద్దేశంతో వరంగల్​లో ఓ యువకుడు పాదయాత్రకు నడుంబిగించాడు. ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాష్ అనే యువకుడు హన్మకొండ నుంచి మేడారం వరకు పాదయాత్ర చేపట్టాడు. మేడారం వెళ్లే దారిలో ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రజల్లో చైతన్యం నింపనున్నారు.

గతంలో కూడా ఈ యువకుడు ఇదే విధంగా ప్లాస్టిక్​కి వ్యతిరేకంగా మేడారం వరకు పాదయాత్ర చేశాడు. ఈ కార్యక్రమానికి మద్దతుగా వరంగల్ జిల్లా అటవీ ముఖ్య సంరక్షణ అధికారి అక్బర్​తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు తరలివచ్చారు. మేడారం జాతరలో ప్లాస్టిక్​ను దశల వారిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రకాష్ పిలుపు నిచ్చారు.

ప్లాస్టిక్ రహిత జాతర కోసం.. పాదయాత్ర

ఇదీ చూడండి : 'ఆ ఊళ్లో అమ్మాయి పుడితే... పండుగ చేసుకుంటారు'

ABOUT THE AUTHOR

...view details