తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద బాధితులకు పునరావాసాలు... భోజనం పెడుతున్న స్వచ్ఛంద సంస్థలు - flood effects

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వరద బాధితులకు అధికారులు పునరావాసం కల్పించగా... పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు భోజన ప్యాకెట్లు అందిస్తున్నారు.

food distribution to flood effected people in mulugu
food distribution to flood effected people in mulugu

By

Published : Aug 23, 2020, 3:59 PM IST

ములుగు జిల్లాలో పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ములుగు మండలంలోని జంగాలపల్లి, ఇంచర్ల, పాల్​సబ్​పల్లి, జీవన్​పల్లి వరద బాధితులకు ఎస్టీ హాస్టళ్లలో వసతులు ఏర్పాటు చేశారు. వెంకటాపూర్ మండలం రామప్ప లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు పాపయ్యపల్లి, సింగర్​కుంటపల్లి ప్రజలకు రామంజపూర్ బాలికల హాస్టల్​లో, చుంచు కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ అధికారులు పునరావాసం కల్పించారు.

వరద బాధితులకు మేము ఉన్నామంటూ భోజన వసతులు కల్పించేందుకు సూర్యాపేటకు చెందిన నైవేద్య నిధి ఆర్గనైజింగ్ సంస్థ ముందుకొచ్చింది. మలుగు ఎస్సీ హాస్టల్​లో ఉన్న వరద బాధితులకు రాత్రి భోజన వసతులు కల్పించారు. ఇంకా కొన్ని ముంపు గ్రామాల్లోకి వెళ్లి భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నైవేద్య నిధి ఆర్గనైజర్ అధ్యక్షులు సంధ్య, జనరల్ సెక్రెటరీ హరీశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

ABOUT THE AUTHOR

...view details