ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మొట్టమొదటి సారిగా మేడారం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి వరదనీరు తాకింది.
ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు - heavy rains in medaram
ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మొట్టమొదటి సారిగా మేడారం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు
ఇప్పటికే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పస్ర నుంచి మేడారం వరకు రవాణా సౌకర్యాలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. మేడారం గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే చిలకలగుట్టను తాకిన వరద... గద్దెలవైపు పయనిస్తోంది.