ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సకల సేవలు అందించడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తాజాగా వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన 500 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, 20 మంది పోగ్రాం ఆఫిసర్లు.. తమ సేవలందించనున్నారు.
మేడారంలో 500 మంది కేయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు - ములుగు జిల్లా
మేడారం జాతరలో 500 మంది వాలంటీర్లు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భక్తులకు దాహం తీర్చనున్నారు.
మేడారంలో 500 మంది కేయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
గద్దెల వద్ద, క్యూలైన్లలో ఉన్న భక్తులకు దాహం తీర్చడం కోసం మంచినీళ్లు అందించనున్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక్కో చోట ఏడుగురితో కూడిన ఒక బృందంతో సేవలందించేందుకు సిద్ధమయ్యారు. జాతర నిర్వహిస్తున్న అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు స్వచ్ఛ, స్వేచ్ఛ, పరిశుభ్ర జాతరను నిర్వహించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సిద్ధమయ్యారు.
ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!