తునికాకు గుత్తేదారుల పనేనా..!
ప్రశ్నార్థకంగా మారుతున్న అడవుల మనుగడ - ప్రశ్నార్థకంగా మారుతున్న అడవుల మనుగడ
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అడవులు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తున్నాం. కానీ ఆచరణలో మాత్రం కనిపించదు. నిత్యం కళ్లెదుటే వందలాది ఎకరాల కారడవి కాలి బూడిదైపోతోంది. అధికారుల నిర్లక్ష్యం వనాల పాలిట శాపంగా మారింది. వ్యక్తిగత స్వార్థంతో మనం చేసే పనుల వల్ల అడవులన్నీ బూడిదై పోతున్నాయి.
వారం కిందట తాడ్వాయి మండలం బంధాలలో పట్టపగలే అడవిలో నిప్పురాజుకుని సమీపంలో ఉన్న ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తునికాకు సేకరణకోసం గుత్తేదారులే అడవులను తగలబెట్టిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక ప్రాంతంలో నిప్పురాజేస్తే ఏకబికిన వందల ఎకరాలు బూడిదవుతున్నాయి.
పదేళ్ల కిందట బయ్యక్కపేట ప్రాంతంలో ఎంతో దట్టమైన అడవి ఉండేదని అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడంతా మైదానంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటినప్పటికీ అడవుల సంరక్షణ కూడా కీలకమే. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్నప్పుడు అటవీ అధికారులే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పర్యావరణ సంక్షోభం తప్పదు.
ఇదీ చదవండి:ఆ లోక్సభ స్థానాలు తప్పకుండా గెలవాల్సిందే..!