తెలంగాణ

telangana

ETV Bharat / state

తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల్లో మంటలు - తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల్లో మంటలు

తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల్లో మంటలు చెలరేగాయి. అడవి దారి గుండా వచ్చిపోయేవారి వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.

fire accident at tandwai and eturunagaram forest area mulugu district
తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల్లో మంటలు

By

Published : Apr 27, 2020, 12:56 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమీపంలో అడవికి మంటలు అంటుకున్నాయి. వేసవి అయినందున అడవిలో చెట్లు, ఆకులు పూర్తిగా కాలిపోయాయి. అడవిలోకి వెళ్లే పశువుల కాపరులు బీడీలు తాగి అక్కడే పడేసినందున ఈ ప్రమాదం జరిగిందని బీట్‌ అధికారులు అంటున్నారు.

ఏటూరునాగారం అడవుల్లో నిన్న సాయంత్రం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు.

రహదారి వెంట వచ్చిపోయే ప్రయాణికులు, ఆకతాయిల వల్ల అడవి మొత్తం నాశనం అవుతుందని బీట్ ఆఫీసర్ అన్నారు.

ఇదీ చూడండి:ఉద్యమ ప్రస్థానం: గుండె గుండెలో గులాబీ లిఖితం

ABOUT THE AUTHOR

...view details