ములుగు జిల్లాలో వాజేడు, వెంకటాపురం, మంగపేట ఏటూరునాగారం మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆదివారం నుంచి వరుణుడు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉన్నాడు. నిన్నటి నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. చేతికందొచ్చిన పంట తడిసి ముద్దవుతుంటే రైతుల గుండెలు చెరువవుతున్నాయి.
అకాల వర్షం... అపార నష్టం - ములుగు జిల్లాలో కురిసిన వర్షంతో రైతుల కష్టాలు
అకాల వర్షం అన్నదాతలకు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆరుగాలం పండించిన పంట కళ్లెదుటే తడిసి మద్దయింది. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అకాల వర్షం... అపార నష్టం